సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ‌ మ‌రో లేఖ

శాస‌న మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ లేఖ

అమరావతి: ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీఎం జగన్ కు మ‌రో లేఖ రాశారు. ఆయ‌న‌ వ‌రుస‌గా కొన్ని రోజుల నుంచి జ‌గ‌న్‌కు లేఖ‌లు రాస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సారి శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. మెజార్టీ ఉన్న స‌మ‌యంలో మండలిని రద్దు చేస్తే వైసీపీ చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని ఆయ‌న తెలిపారు. కొన్ని నెల‌ల క్రితం వైసీపీకి మెజార్టీ లేనప్పుడు శాస‌న‌ మండలి రద్దు కోసం తీర్మానం చేయ‌డంతో ఈ విష‌యంపై ప్రజల్లో సందేహాలు త‌లెత్తాయ‌ని ఆయ‌న అన్నారు.

ఇప్పుడు రద్దు చేస్తే మాత్రం ప్రజల్లో జ‌గ‌న్‌కు ఉన్న‌ గౌరవం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. గ‌తంలో మండలిని కొనసాగించడం వృథా అని జగన్ అన్నార‌ని, మండ‌లి గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌లు నమ్మాలంటే వెంట‌నే దానిని రద్దు చేయాలని కోరారు. మండలి రద్దుకు పార్లమెంట్‌లో తాను కూడా ప్రయత్నిస్తాన‌ని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/