రాఫెల్‌డీల్‌పై మోడీ మిత్రునికి 1.30లక్షల కోట్లు

Rafel
Rafel

రాఫెల్‌డీల్‌పై మోడీ మిత్రునికి 1.30లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రధానిమోడీ చేసిన రాఫెల్‌ డీల్‌కారణంగా ఆయన స్నేహితునికి భారత్‌లో పన్నులు చెల్లించేప్రజలు వచ్చే 50 ఏళ్లపాటు లక్షకోట్లు చెల్లించాల్సి వస్తోందని, 36 రాఫెల్‌ యుద్ధవిమానాలు భారత్‌కొనుగోలుచేస్తున్న సందర్భంగా 56అంగుళాల ఛాతి స్నేహితుడి మిత్రునికి ఈలాభం చేకూరుతుం దని వ్యాక్యానించారు. గాంధీ తరచూ ఇటీవల మోడీపై 56 అంగుళాల ఛాతి అంటూ వ్యాఖ్యలుచేస్తున్న సంగతి తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికలనుంచి ఈ పదాన్ని తరచూ వినియోగిస్తూ వస్తున్నారు. అలాగేతన విశాలమైన ఛాతిని పాకిస్తాన్‌, చైనాలతో జరిగేలావాదేవీల్లో కూడా చూపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌చేసింది. వచ్చే 50 ఏళ్లపాటు భారత్‌లో పన్నుచెల్లింపుదారులు ఈ మిస్టర్‌ 56 స్నేహి తుడు జాయింట్‌ వెంచర్‌కు లక్షకోట్లుచెల్లించాల్సి ఉంటుందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అంతేకా కుండా కాంగ్రెస్‌ చీఫ్‌ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఇన్వెస్టర్‌ నివేదికనుసైతం జతచేసారు. ఈ నివేదికలో నిజం ఉందని, అయితే సహజంగానే రక్షణ మంత్రి ఇదంతా నిరాధారమని కొట్టివేస్తారని ఎద్దేవాచేసారు. గాంధీ ముందురోజు మిస్టర్‌ 56 ఫ్రెండ్‌ ఈ డీల్‌లో సుమారు 1.30 లక్షలకోట్లు లబ్దిపొందుతారని, రాఫెల్‌డీల్‌ కాంట్రాక్టులు మార్చడమే ఇందుకుకీలకమని అన్నారు. కాంగ్రెస్‌ బిజెపి ప్రభుత్వంపై ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్‌డీల్‌పై తరచూ ధ్వజమెత్తుతూ వస్తోంది. రిలయన్స్‌ డిఫెన్స్‌కు కాంట్రాక్టును మంజూరుచేయడంలో నిబంధనలన్నింటినీ తుంగలోనికి తొక్కారనిఅన్నారు. ప్రధాని,మోడీ సీతా రామన్‌లు జాతికి అబద్దాలుచెపుతున్నారని వాదించారు. ఈడీల్‌లో జాతిశ్రేయస్సును తాకట్టుపెట్టారని కాంగ్రెస్‌ విమర్శించింది.