విజయదశమి నాడు భారత్‌కు రానున్న రఫేల్‌ యుద్ధ విమానాలు

rafel
rafel

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాల సంస్థ డసాల్ట్‌తో ఒప్పందంలో భాగంగా తొలి 36 విమానాలను భారత్‌కు అక్టోబర్‌ 8న చేరనున్నాయి. రఫేల్‌ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి స్వీకరించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫ్రాన్స్‌కు బయలుదేరనున్నారు. ఈ మేరకు భారత రక్షణశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌ 8 విజయదశమి అయినందున ఆ రోజును ఎంపిక చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌ విమానాలను స్వీకరించిన తరువాత రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక శిక్షణ విమానంలో ప్రయాణించి పరిశీలిస్తారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ బెంగుళూరులో తేజస్‌లో లైట్‌ కంబాట్‌ యుద్ధ విమానంలో ప్రయాణించారు. భారత్‌ ఎల్‌సిఒ విమానాల ఎగుమతులకు సిద్ధమైన నేపథ్యంలో తేజస్‌లో ప్రయాణించడం అద్బుతమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత్‌ గతంలో 36 రఫేల్‌ యుద్ధ విమానాలకు ఫ్రాన్స్‌కు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పూర్తయిన రువాత మళ్లీ వచ్చే ఏడాది ప్రారంభంలో మరో 36 విమానాలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/