రాఫెల్‌ కుంభకోణంపై విచారణ : కాంగ్రెస్‌ డిమాండ్‌

RAFEL1
RAFEL

రాఫెల్‌ కుంభకోణంపై విచారణ
కాంగ్రెస్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: రాఫెల్‌డీల్‌లో తన బిజినెస్‌ స్నేహితునికి లబ్దిచేకూరేంతగా అవినీతిజరిగిందని, తక్షణమే కేసునమోదుచేసి విచారణజరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల బృందం చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందచేసింది. అంతేకాకుండా రాఫెల్‌ జెట్‌ డీల్‌పై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌చేసింది. కమ్‌ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌జనరల్‌(కాగ్‌)నుసైతం ఈ అవకతవకలతపై సమగ్ర నివేదిక రూపొందించి పార్లమెంటుకు అందచేయాలని డిమాండ్‌చేసారు. సివిసి కెవిచ ౌదరిని కలిసి ఒక సమగ్ర వినతిపత్రాన్ని అందిం చారు.

ప్రభుత్వధనానికి చిల్లుపెడుతున్న ఈ అవినీత ఇకుంభకోణంపై దేశ భద్రత, శ్రేయస్సు దృష్ట్యా విచారణచేయాలని కోరారు. ప్రభుత్వరంగంలోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను కాదని, ఒక బిజినెస్‌ మిత్రునికోసం కాంట్రాక్టును మార్చి మరీ ఇప్పించడంలో ఔచిత్యం ఏమిటని ప్రతినిధిబృందం నేతలుప్రశ్నించారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు గులామ్‌నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌, ఆనంద్‌శర్మ, కపిల్‌సిబాల్‌, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, జైరామ్‌రమేష్‌, అభిషేక్‌మనుసింగ్వి, మనీష్‌ తివారి, వివేక్‌ తంకా, ప్రమోద్‌ తివారి, ప్రణవ్‌ఝా తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రాఫెల్‌ జెట్‌ డీల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ బిజెపి ప్రభుత్వంపైమెరుపుదాడికి దిగిన సంగతి తెలిసిందే.

ప్రధానమంత్రి రక్షణరంగ నిబంధనలను సైతం ఉల్లంఘించి రాఫెల్‌డీల్‌తనమిత్రునికి ఇప్పించడంలో కీలక కృషిచేసారన్నారు. ప్రధానమంత్రి, ఆర్ధిక మంత్రి, రక్షణ మంత్రులు ఈ డీల్‌పై అవాస్తవాలు చెపుతున్నారని అన్నారు. రాఫెల్‌ వివాదం గత వారంనుంచి భారీ ఎత్తున దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఫ్రెంచ్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలేండీ భారత ప్రభుత్వం రిలయన్స్‌ డిఫెన్స్‌ పేరును ప్రతిపాదించిందని, అందువల్లనే డస్సాల్ట్‌ ఏవియేషన్‌ ఆపేరునే ఖరారుచేసిందనిఅన్నారు. ప్రధానమంత్రి మోడీ 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలుకు ఫ్రెంచ్‌అధ్యక్షుడు హాలెండీతో 2015 ఏప్రిల్‌ పదవ తేదీ ప్యారిస్‌ వెళ్లి చర్చలుజరిపారు. దరిమిలా ఈ పర్యటనకు అప్పట్లో అనిల్‌ అంబాని కూడా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.