ఇటాలియన్ ఓపెన్‌ విజేత నాదల్‌

Rafael Nadal
Rafael Nadal

హైదరాబాద్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ బరిలో దిగిన 50వ మాస్టర్ సిరీస్ ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ రఫెల్ నాదల్‌ 6-0, 4-6, 6-1తో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై గెలుపొందాడు.ఈ విజయంతో నాదల్‌ అత్యధికంగా 34 మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇటాలియన్ ఓపెన్‌లో విజేతగా నిలవడం నాదల్‌కు ఇది తొమ్మిదోసారి. తొలి సెట్లో అయితే వరుసగా ఆరు గేమ్‌లు గెలిచిన నాదల్… మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేయడం విశేషం. ఈ విజయంతో రఫెల్ నాదల్‌కు 9,58,055 యూరోలు (రూ.7 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీతో పాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

తాజా క్రీడా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/