రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ..

రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – గోల్డెన్ బ్యూటీ పూజా హగ్దే జంటగా రాధా కృష్ణ డైరెక్షన్లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ ‘రాధే శ్యామ్’. సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ తరుణం లో థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. డిసెంబర్ 17న ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం.

ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం అన్నీ భాషలలో సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ – టి సిరీస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.