పండగకే ప్లాన్ చేసిన రాధేశ్యామ్

పండగకే ప్లాన్ చేసిన రాధేశ్యామ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో చేయబోయే పర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుందట.

కాగా ఈ సినిమా నుండి కేవలం పోస్టర్, మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ కాగా, ఈ సినిమా టీజర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తనదైన శైలిలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.