రాధే శ్యామ్ నుండి మరో అప్డేట్ వచ్చింది

మొన్నటి వరకు ప్రమోషన్స్ విషయంలో సైలెంట్ గా ఉన్న రాధే శ్యామ్ యూనిట్..ఇప్పుడు స్పీడ్ పెంచారు. సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ చేస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి రెండు పాటలు విడుదలై శ్రోతలను ఆకట్టుకోగా..తాజాగా మరో సాంగ్ కు సంబదించిన ప్రోమో రిలీజ్ చేసారు.

“రాధేశ్యామ్ నుంచి హిందీ సెకండ్ సింగిల్ ‘సోచ్ లియా’ సాంగ్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటలో పూర్తి గా ప్ర‌భాస్‌, పూజా హెగ్డే ల మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండ్ క‌నిపించింది. ఇక డిసెంబర్ 8న ఫుల్ సాంగ్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ‘వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్’ పేరుతో ‘రాధే శ్యామ్’ హిందీ వెర్సన్ నుంచి బుధవారం విడుదలైన ‘ఆషికీ ఆ గయీ’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ”నగుమోము తారలే” అనే గీతాన్ని రిలీజ్ చేశారు. నేను రోమియోని కాదని ప్రభాస్ చెప్పగా.. ‘కానీ నేను జూలియట్ ని.. నాతో ప్రేమలో పడితే చస్తావ్’ అని పూజా అనడంతో ఈ పాట మొదలవుతుంది.

‘నగుమోము తారలే.. తేగిరాలే నేలకే.. ఒకటైతే మీరిలా.. చూడాలనే.. సగమాయే ప్రాయమే.. కదిలేను పాదమే.. పడసాగే ప్రాణమే.. తన వెనకే’ అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను , అభిమానులను విశేషంగా అలరిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించగా .. మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తనదైన వాయిస్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. జనవరి 14 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

YouTube video