రివర్స్‌లో వెళ్తున్న రాధేశ్యామ్.. సాహో రిజల్ట్ రిపీట్..?

రివర్స్‌లో వెళ్తున్న రాధేశ్యామ్.. సాహో రిజల్ట్ రిపీట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కోసం గతకొంత కాలంగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను పూర్త పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంగా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలోని ఓ అంశంలో చిత్ర యూనిట్ సాహో స్ట్రాటెజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.

దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. గతంలో ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం సుజీత్ రివర్స్ స్క్రీన్‌ప్లే పద్ధతిని వాడాడు. ఆ సినిమాలో స్క్రీన్‌ప్లే చాలా స్లోగా ఉన్నట్లు ఆడియెన్స్ ఫీల్ అయ్యారు. వచ్చిన సీన్స్ మళ్లీ వస్తున్నాయా అని అందరూ అనుకున్నారు. దీంతో చాలా మందికి సాహో చిత్ర స్క్రీన్‌ప్లే ఏమాత్రం నచ్చలేదనే టాక్ అప్పట్లో వినిపించింది. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ చిత్రం కూడా ఇదే తరహా స్ట్రాటెజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రివర్స్ స్క్రీన్‌ప్లే రాధేశ్యామ్ చిత్రానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అని అందరూ ఆందోళన చెందుతున్నారు.

ఏదేమైనా ప్రభాస్ తనకు డిజాస్టర్ రిజల్ట్‌ను మిగిలించిన సాహో చిత్రం స్ట్రాటెజీని మరోసారి రిపీట్ చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి సాహో స్ట్రాటెజీ రాధేశ్యామ్‌కు ఎంతవరకు మేలు చేస్తుందా అనే అంశం మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇటలీలో జరుపుకోగా అతి త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.