బీభత్సం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్ పోలీసులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన చెడ్డీగ్యాంగ్

Cheddi-Gang
Cheddi-Gang

హైదరాబాద్‌: గత నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్ పరిధిలో ఆరు చోట్ల దోపిడీలకు పాల్పడి, హైదరాబాద్ పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగల్చడంతో పాటు, తమను పట్టుకోవాలంటూ సవాల్ విసిరిన చెడ్డీగ్యాంగ్ ను రాచకొండ పోలీసులు ఎట్టకేలకు హయత్ నగర్ సమీపంలో చెడ్డీ గ్యాంగ్ బృందాన్ని అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురు సభ్యుల బృందాన్ని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 150 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, మరింత నగలను రికవరీ చేయాల్సి వుందని అధికారులు వెల్లడించారు. చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
కాగా చెడ్డీ గ్యాంగ్ ఇంటికి తాళం వేసుంటే దొంగతనం, లేకుంటే కత్తులు తదితర మారణాయుధాలతో బెదిరించి చోరీ. కేవలం చెడ్డీలు వేసుకుని, ఒళ్లంతా నూనె రాసుకుని, నలుగురు నుంచి ఆరుగురు సభ్యుల ముఠాగా రాత్రిళ్లు, శివారు ప్రాంతాల్లోని కాలనీ వీధుల్లో తిరుగుతూ, కనిపించిన ఇంట్లోకి జొరబడి దొంగతనాలకు పాల్పడటమే వీరి వృత్తి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/