మూడు పెళ్లిళ్ల ఫై పవన్ క్లారిటీ..మళ్లీ అంటే వారు ఊర కుక్కలే..

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కు ముఖ్య అతిధిగా వచ్చారు. మంగళవారం ఈ ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో జరిగింది. ఈ షో కు పవన్ కళ్యాణ్ వస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఆత్రుత పెరిగింది. ఈ షో లో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాగా..ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓ టాక్ షో కు హాజరు కాబోతుండడం తో అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక ఈ షో లో పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు వేస్తారో..ఏ ఏ సమాదానాలు రాబడతారో అనే ఆసక్తి నెలకొంది.

అంత అనుకున్నట్లే ఈ షోలో పలు ఆసక్తికర ప్రశ్నలు బాలకృష్ణ అడిగినట్లు..వాటికీ పవన్ కళ్యాణ్ సమాదానాలు తెలిపినట్లు తెలుస్తుంది. ఇక ఈ పెళ్లిళ్ల గోల ఏంటి అని నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను సూటిగా ఒక ప్రశ్న అడగగా పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టుగా సమాధానం ఇచ్చినట్లుగా ఆ ఎపిసోడ్లో ప్రేక్షకులుగా పాల్గొన్నవారు చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో ఎలాంటి సమాధానం ఇచ్చి ఉంటారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు కానీ అది సరైన సమాధానం అని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.

బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రతిసారి నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి కూడా సరైన సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇకనుంచి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఎవరైనా కామెంట్ చేస్తే వారు ఊర కుక్కతో సమానమని.. సమస్యలపై దమ్ముంటే ప్రశ్నించాలి అని, సమాధానం చెప్పకుండా ఆ తరహాలో ప్రశ్నించడం కరెక్ట్ కాదు అని ఆయన తీవ్రస్థాయిలో ప్రత్యర్థులకు హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తోంది. పవన్ నుండి రాబోయే సినిమాల గురించి , జనసేన పార్టీ గురించి ఇక తదితర విషయాలని బాలయ్య అడిగి తెలుసుకున్నట్లు చెపుతున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో డైరెక్ట్ క్రిష్ కూడా హాజరయ్యారట. అలాగే చరణ్ , త్రివిక్రమ్ లతో పవన్ ఫోన్ లో మాట్లాడినట్లు చెపుతున్నారు.