వర్మ సినిమాను ప్రదర్శించలేమంటూ పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ ప్రకటన

రామ్ గోపాల్ వర్మ..ఒకప్పుడు ఈ పేరుకు ఎంతో డిమాండ్ ఉండేది. ఈయన నుండి సినిమా వస్తుందంటే అభిమానులు టికెట్స్ కోసం థియేటర్స్ లలో క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ఫ్రీగా చూపిస్తాం అన్నగాని చూసేవారు లేరు. అంతలా వర్మ డిమాండ్ పడిపోయింది. గత కొంతకాలంగా బోల్డ్ చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్న వర్మ…తాజాగా ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య స్వ‌లింగ సంపర్కం నేప‌థ్యంలో నడిచే డేంజ‌ర‌స్‌ అనే సినిమా తెరకెక్కించాడు.

ఈ మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాను తన ట్విట్టర్ లో తెగ ప్రమోషన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ సినిమాను మీము ప్రదర్శించలేమంటూ పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ తేల్చి చెప్పాయట. ఈ విషయాన్నీ స్వయంగా వర్మనే తెలిపాడు. త‌న సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుమ‌తి ల‌భించిన అంశాన్ని ప్ర‌స్తావించిన వ‌ర్మ‌… ఈ రెండు సినిమా థియేట‌ర్లు త‌న సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు తిర‌స్క‌రించి స్వ‌లింగ సంప‌ర్కుల‌ను అవ‌మానించాయంటూ వ‌ర్మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

. @_PVRcinemas , ⁦@INOXCINEMAS⁩ refusing to screen my film KHATRA (DANGEROUS) becos it’s theme is LESBIAN ,and this after Supreme Court repealed section 377 and censor board already passed .it is a clear cut ANTI stand of their managements against #LGBT community pic.twitter.com/GxoHDH7Tjw— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022