విజయవాడ వైఎస్‌ఆర్‌సిపి ఎంపి అభ్యర్థిగా పీవీపీ?

Potluri Varaprasad
Potluri Varaprasad

అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లురి వరప్రసాద్‌( పీవీపీ) రేపు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అయితే పీవీపి విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. కాగా ఈ నెల 23న ఆయన నామినేషన్‌ వేస్తారని ప్రచారం జరుగుతోంది. పీవీపీ గత ఎన్నికల్లోనే వైఎస్‌ఆర్‌సిపి తరపున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైకాపా అధిష్ఠానం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/