కామన్వెల్త్ క్రీడలు..స్వర్ణం సాధించిన పీవీ సింధుకు

కెనడా అమ్మాయి మిచెల్లీ లీని చిత్తుచేసిన సింధు

pv-sindhu-wins-first-gold-in-cwg-badminton-women’s-singles

బర్మింగ్‌హామ్‌ః కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో తెలుగుతేజం పీవీ సింధు పసిడి పతకం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్స్ లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘనవిజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21-15, 21-13 తో అలవోకగా నెగ్గింది.

బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ అంశంలో సింధుపై మొదటి నుంచి పసిడి ఆశలు ఉన్నాయి. ఆమె తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని భారత శిబిరం నమ్మకం ఉంచింది. అటు అభిమానులు కూడా సింధు కామన్వెల్త్ స్వర్ణం అందుకోవాలని ఆకాంక్షించారు. అందరి అంచనాలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ సింధు కామన్వెల్త్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేతగా అవతరించింది.

కాగా, కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణ పతకం. ఈ పతకంతో బర్మింగ్ హామ్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 56కి పెరిగింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/