భారత షట్లర్లకు సవాలే

భారత షట్లర్లకు సవాలే
ఆసియా క్రీడల్లో భారత షట్లర్లకు పెను సవాల్ ఎదురుకానుంది. ఉపఖండం బాడ్మింటన్‌కు పుట్టినిల్లు కావడంతో ప్రపంచ చాంపియన్ల అందరూ ఇక్కడే వున్నారు. హేమాహేమీలతో పోరుకు భారత షట్లర్లు చెమటో డ్చాల్సి వస్తోంది.చైనా, జపాన్, మలేషియా, కొరియా, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్, చైనీస్తైపిల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. టాప్-10 ర్యాంకర్లలో ఒక్కరిద్దరు పొరుగు దేశాల్లో వున్నారు.మిగిలిన షట్లర్లందరూ ఆసియా వాసులు కావడం గమనార్హం.ఆసియా క్రీడల్లో బాడ్మింటన్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే 1951 ఆసియా క్రీడలు మొదలు 2014 ఇన్ంచియాన్ వరకు భారత్ ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగోలే దు.
ఇప్పటి వరకు బాడ్మింటన్‌లో సాధించిన పతకాల సంఖ్య కేవలం 8 మాత్రమే కావడం విశేషం.అవికూడా కాంస్య పతకాలు కావడం గమ నార్హం.ఆసియా క్రీడల్లో తొలి పతకాన్ని 1974లో టెహ్రాన్‌లో బోణీ కొట్టింది.డబుల్స్‌లో దేవేందర్ అహుజ,ప్రకాశ్పదుకొనె ద్వయం కాంస్యపతకాన్ని చేజిక్కించుకుని, భారత్‌కు తొలిపతకాన్ని అందించారు.
అనంతరం 1982లో భారత్ ఆసియా క్రీడలకు ఆతిథ్యమివ్వడంతో మళ్లీ పతకాల వేట కొనసాగింది.డబుల్స్‌లో లారీ డిస, ప్రదీప్గాంధి, మిక్స్డ్ డబుల్స్‌లో లారి డిస, కన్వల్తాకర్ జోడి కాంస్య పతకాలు సాధించారు.అదేవిధంగా టీమ్ విభాగంలో లారి డిస, ప్రదీప్గాంధి, సయ్యద్మోదీ,మహిళల టీమ్ విభాగంలో వందన, అమిత్,మధుమిత, సింగిల్స్ లో సయ్యద్మోదీ కాంస్య పకతాలను కైవసం చేసుకు న్నారు. దీంతో భారత్ ఆతిథ్యమిచ్చిన ఆసి యా క్రీడల్లో ఐదు కాంస్య పతకాలను చేజిక్కించు కున్నారు.
1986లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో లారి డిస,విమల్‌కుమార్,ప్రకాశ్పదుకొనె టీమ్ విభాగంలో కాంస్యపతకాన్ని దక్కించుకున్నా రు. 2014 ఇన్ంచియాన్ ఆసియా క్రీడల్లో నేటిత రం స్టార్ షట్లర్లు సైనానెహ్వాల్, పివి సింధు, అశ్వనిపొన్నప్ప సైతం టీమ్ విభాగంలో కాంస్యంతో సరిపెట్టుకున్నారు.దీన్ని బట్టి ఆసియా క్రీడల్లో పోటీ ఎంత గట్టిగా వుందో ఇట్టే తెలుస్తోంది.హేమాహోమీలైన సయ్యద్ మోదీ, ప్రకాశ్పదుకొనె, విమల్‌కుమార్ లాంటి వారుకూ డా స్వర్ణం చేజిక్కించుకోలేక పోయారు.
కనీసం రజత పతకానికి భారత్ నోచులేకపోవడం విచార కరం.జకర్తా ఆసియా క్రీడలపై షట్లర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.అయితే ఈ ఏడాది జరిగిన ఇండోనేషియా, ఇండియా ఓపెన్, మలేసియా, చైనా, థాయిలాండ్, సింగపూర్ ఓపెన్ వరకు భారత షట్లర్లు ఆశించిన స్థాయిలో రాణించలే కపోవడం ఆందోళన కల్గిస్తోంది.ఒకటి రెండు టోర్నీల్లో ఫెనల్స్‌కు చేరుకున్నా బొక్కబోర్లా పడ్డారు.ఫైనల్ బెర్త్ అధికమించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.దీనికి తోడు టాప్ సీడ్ షట్లర్లు ఎదురుకావడంతో ఒత్తిడికిలోనై వెనుదిరు గుతున్నారు.
గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల టీమ్ విభాగంలో రాణించి స్వర్ణం చేజిక్కించుకు న్నారు.మహిళల సింగిల్స్ఫైనల్లో సైనాతో సింధు తలపడి రజతం దక్కించుకుంది,అయితే ఈ ఏడాది జరిగిన ప్రతిటోర్నీలో సింధు నాలుగు సార్లు ఫైనల్స్‌కు చేరి బోల్తాకొట్టింది.ఇండియా ఓపెన్, థాయిలాండ్ ఓపెన్, చైనా ఓపెన్, చైనీస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించిన సింధు రెండు సార్లు నొజామి ఒకుహర చేతిలో, మరో రెండు సార్లు జాంగ్వు§్ు చేతిలోపారాజం పాలైంది.అదేవిధంగా సైనా ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో థా§్ు టిజు యింగ్ చేతిలో పరాజయం పొందింది.
శ్రీకాంత్, ప్రణ§్ు, ఎస్.వర్మ ఫ్రణీత్ క్వార్టర్స్ అధికమిం చడానికి ఆపసోపాలు పడ్డారు.మలేషియా ఓపెన్‌లో శ్రీకాంత్, ఆసియా ఓపెన్‌లో ప్రణ§్ు, ్ససాయిపణీత్ సెమీస్‌కు చేరినా ఇంటిదారి పట్టారు.ఈనేపథ్యంలో జకర్తా ఆసియా క్రీడలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.పురుషుల ర్యాంకిం గ్ల్లో శ్రీకాంత్ ఐదో స్థానంలో, ప్రణ§్ు 11వ స్థానంలో కొనసాగుతున్నారు.
వీరికి వరుసగా టాప్ 2 లీచాంగ్ వి§్ు (మలేషియా),షి యుకి (చైనీస్తైౖపి),సన్‌వాన్ (కొరియా),కెంటొమెమోట (జపాన్),చౌతియాన్ చెన్ (తైవాన్), చెన్‌లాంగ్ (చైనీస్) లింగ్డాన్ (చైనీస్)తో గట్టి పోటీ ఎదురుకా నుంది.అదేవిధంగా హాంకాంగ్‌కు చెందిన అంగ్స్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కోనున్నారు.చెన్‌లాంగ్ రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోగా, లిన్‌డాన్ రెండు సార్లు ఒలింపియన్ టైటిల్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఐదు సార్లు ప్రపంచ చాంప్, ఆరు సార్లు ఆల్ ఇంగ్లండ్ విజేతగా నిలిచాడు.దీంతో భారత షట్లర్లుకు తొలిరౌండ్ నుంచే ముచ్చమటలు పట్టనున్నాయి.మహిళల సింగిల్స్‌లో సింధు మూడో ర్యాంక్‌లో కొనసాగుతుండగా, సైనా పదో స్థానంలో కొనసాగుతోంది.
ఈ ఏడాది వీరిరువురు ముఖాముఖి తలపడిన కామన్వెల్త్ ఫైనల్లో సైనా పై చేయిసాధించింది.అదేవిధంగా ఇండోనేషియా ఓపెన్‌లో క్వార్టర్స్‌లో సైనాతో తలపడిన పివి సింధు ఇంటి దారిపట్టింది.
ఈనేపథ్యంలో వీరిద్దరి ప్రదర్శన అద్భుతంగా వున్నప్పటికీ ఫైనల్లో తడబడి ఒత్త్తిడికి లోనవుతున్నారు.దాంతో ఫైనల్ పోబియాను అధికమిస్తే ఆసియా క్రీడల్లో కచ్చితంగా పతకం నెగ్గే సత్తా వుంది.శ్రీకాంత్, ప్రణ§్ు, పివి సింధు,సైనానెహ్వాల్ సింగిల్స్‌లో పోటీ పడనున్నారు.
అదేవిధంగా స్తాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి, మను ఆత్రి, సుమీత్ రెడ్డి డబుల్స్‌లో, శ్రీకాంత్ నేతృత్వంలో సమీర్‌వర్మ, ప్రణవ్ చోప్రా, సౌరభ్ తదితరులు టీమ్ విభాగంలో బరిలోకి దగనున్నారు.అదేవిధంగా మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి, అశ్వనిపొన్నప్ప, రుతపర్ణా, ఆర్తిసార, టీమ్ విభాగంలో సింధు నేతృత్వంలో సాయిఉత్తేజిత, అస్మిత, గాయత్రి, ఆకర్షి తదితరులు పోటీ పడనున్నారు.