సెమీస్‌కు చేరిన సింధు

pv-sindh
pv-sindh

బాసెల్: భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో సింధు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు సెట్ల ఉత్కంఠ సమరంలో సింధు 1221, 2321, 2119 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభ సెట్‌లో భారత స్టార్ సింధుకు చుక్కెదురైంది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన తైజు ఏ దశలోనూ సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో అలరించిన తైపీ క్రీడాకారిణి ఏ మాత్రం కష్టపడకుండానే సెట్‌ను దక్కించుకుంది. ఇక, రెండో సెట్‌లో సింధు పుంజుకుంది. ఈసారి దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు సాగింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/