కమలహాసన్‌ ను కలిసిన సింధు


దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందంటూ ప్రశంస

Kamal Haasan- PV Sindhu
Kamal Haasan- PV Sindhu

చెన్నై: ఇండియన్ టెన్నిస్ స్టార్ పీవీ సింధు ప్రముఖ సినీ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ ను కలుసుకుంది. చెన్నైలోని ఎంఎన్ఎం పార్టీ కార్యాలయానికి వెళ్లి కమల్ తో భేటీ అయింది. తన కార్యాలయానికి వచ్చిన సింధును కమల్ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆమెతో కలిసి లంచ్ చేశారు. అనంతరం కమల్ మాట్లాడుతూ, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ను గెలిచి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందంటూ సింధుపై ప్రశంసల జల్లు కురిపించారు. సింధు మాట్లాడుతూ, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని చెప్పింది. ఈ సమావేశానికి సింధుతో పాటు ఆమె తల్లి కూడా వచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/