చైనా ఓపెన్‌లో సింధు ఓటమి

P. V. Sindhu
P. V. Sindhu

ఫుజౌ(చైనా): ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పివి సింధు మరోసారి నిరాశపరిచింది. చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీలో మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. చైనా ఓపెన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భాగంగా జరిగిన తొలి రౌండ్‌లో చైనీస్‌ ప్లేయర్‌ పాయ్‌ యు పో చేతిలో ఓడిపోయింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ తొలి గేమ్‌ను సింధుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సునాయాపంగా గెలుచుకుంది. కాగా రెండో గేమ్‌లో పుంజుకుని సింధు తన సత్తా చాటుకుంది. ఇక ఆఖరి రౌండ్‌ నిర్ణయాత్మకం కాగా సింధు- పాయ్‌ నువ్వానేనా అన్నంత హోరాహోరీగా ఆడినా విజయం పాయ్‌ ని వరించింది. ఈ ఓటమి కారణంగా సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాల్సివచ్చింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/