శ్రీవారి సేవలో పీవీ సింధు

PV-Sindu-tirumala
PV-Sindu-tirumala

తిరుమల: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తల్లిదండ్రులతో కలిసి తిరుమల చేరుకున్న సింధు స్వామివారి అభిషేక సేవలో పాల్గొంది. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. అలాగే, సింధుతోపాటు పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తదితరులు కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.


తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/