అపరచాణక్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ

సంస్కరణల రథసారధి పివి నరసింహారావు

PV Narasimha Rao
PV Narasimha Rao

మహానీయుడు, సంస్కర ణల రథసారధి, బహు భాషా కోవిదుడు, తొలి దక్షిణ భారత ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆయన ప్రధానిగా బాధ్య తలు చేపట్టి భేష్‌ అనిపించుకున్నాడు.

మైనారిటీ ప్రభుత్వాన్ని మెజార్టీ ప్రభుత్వంగా తీర్చిదిద్దిన విధానం, అతడు దూరదృష్టి, వాక్చాతుర్యం, సంగీతం, పటనం, రచన, నాటకాలు, ఆయన అభిరుచులు, ఆర్థిక సంస్కరణలు చేపట్టి విజయం సాధించి చరిత్రలో నిలిచిన మహనీయుడు.

తెలంగాణ రాష్ట్రం నుంచి భారత ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిరోహించిన తెలంగాణ ముద్దుబిడ్డ. పాములపర్తి వెంకట నరసింహారావు 18 భాషల్లో అనర్గళంగా సంభాషణ చేసే బహుభాషాకోవిదుడు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పాములపర్తి రుక్కుబాయమ్మ, సీతారామారావు అనే పుణ్యదంప తులకు రెండవ సంతానంగా పివి నరసింహారావ్ఞ జన్మించారు.

తెలంగాణ బిడ్డగా పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిఖరాలను అధిరోహించి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించారు.

వంగర వేలూరు గ్రామాల్లో రెండవ తరగతి హుజురాబాద్‌ జెడ్‌పి హైస్కూల్‌లో పదవ తరగతి వరకు చదివి ఉన్నత విద్య కోసం ఓరుగల్లు నగరానికి వెళ్లారు.పివి చదువ్ఞకునే రోజుల్లో అన్నింటిలోనూ ఆయన ముందుండేవారు.

పివి నరసింహారావు గారి బాల్యవివాహం 10 సంవత్సరాల పిన్న వయసులోనే కుటుంబ పెద్దలు ఆయనకు పెళ్లి చేయాలని నిర్ణయించి దగ్గరి బంధువుల కుమార్తె సత్యమ్మతో పివి కళ్యాణం 1931లో జరిగింది.

చంద్రుని గురించి జయచంద్ర హైందవ ధ్వంసక అనే మకుటంతో కవిత రాశారు. అనేక కథలను రాసి కీర్తి సంపాదిం చారు.

ఇతర భాషల్లోకి తర్జుమా చేశారు. షేక్‌స్పియర్‌ డ్రామాను తెలుగులోకి కథసంగ్రహాలుగా రాశారు.విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణ కల్పవృక్షాన్ని వేయిపడగలు పేరుతో హిందీ లోకి అనువాదం చేశారు.

ఇంగ్లీషు లో వెలువడిన ఇన్‌స్పైడర్‌ అనే పుస్తకం బహుళ ప్రాచు ర్యం పొందింది. దేశంలోని పుస్తక ప్రపంచంలో ఒకసంచల నం సృష్టించింది.

1956లో ఆంధ్రప్రదేశ్‌ పిసిసి ఉపాధ్యక్షు డిగా ఉన్నారు. 1962లో జరిగిన చైనా యుద్ధం బాధి తుల కోసం రక్షణశాఖ నిధికి అత్యధిక విరాళాలుసేకరించా రు.

1956 లో భాషాప్రయుక్త ఏర్పాటులో భాగంగా కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్ప డింది.

1957, 1962,1967, 1972ల లో నాలుగుసార్లు విజయం సాధించి మంథని నియోజకవర్గం పేరును దశదిశలా చాటారు.

1958 నుండి 1960 వరకు అధికార భాషసంఘం సభ్యునిగా పనిచేశారు. 1962లో న్యాయశాఖ జైళ్లశాఖ మంత్రిగా పనిచేసి ఆ శాఖకు వన్నె తెచ్చారు.

జైలులో లైబ్రరీలను నెలకొల్పి ఆట పాటలతో ఖైదీలతో పరివర్తన వచ్చేటట్లు పలుచర్యలు చేపట్టారు.

1964లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసి మద్రాస్‌ రిలీజియన్‌ ఎండోమెంట్‌ చట్టాన్ని తెలంగాణ ప్రాంతంలోని రెగ్యులేషన్‌ చట్టంతో సమన్వయపరిచి కొత్త చట్టాల రూపకల్పన చేశారు.

1965లో వైద్యఆరోగ్యశాఖమంత్రిగా పనిచేసి పలుసంస్కరణలు చేపట్టారు.1967లో విద్యాశాఖమంత్రిగా పనిచేసి తెలుగు అకాడమిని స్థాపించారు.

తెలుగుభాషకు అధికార భాషగా పునాదులు వేసిన ఘనత నరసింహారావుకే దక్కుతుంది.

డిటెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి ఏడవ తరగతి వరకు కామన్‌ పరీక్షలను ప్రవేశపెట్టారు.స్థాయినుంచి డిగ్రీవరకు తెలుగు ను బోధనా భాషగా ప్రవేశపెట్టి అమలు చేశారు.

మార్కులు ముఖ్యం కాదని, తెలివి కోసమే విద్య నేర్చుకోవాలని సూత్రాన్ని ఆయన అమలుచేశారు.

71లో తెలంగాణ ప్రజాసమితి పార్టీ చేతిలో కాంగ్రెస్‌పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది ఏవర్గంలేని ఎవరికి కొమ్ముకాయని గ్రూపులు నిర్వహించని వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని ఇందిరాగాంధీ తలచి పివికి ముఖ్యమైన పీఠాన్ని సెప్టెంబర్‌28,1971లో అప్పగించారు.

ఆ పదవిలో ఆయనఎన్నో గొప్పపనులను చేపట్టి పలువ్ఞరు ముఖ్యమంత్రులకు ఆదర్శనీ యుడయ్యారు.

1972లో పివినాయకత్వాన అసెంబ్లీకి ఎన్నికలు జరగగా 229 సీట్లతో కాంగ్రెస్‌పార్టీ అఖండ విజయంసాధించి రెండవసారిముఖ్యమంత్రిగా పదవిబాధ్యతలు స్వీకరించారు.

ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంకావాలని నినాదం బలపడడంతో అధిష్టానం ఆదేశాలమేరకు 1973జనవరి17న తన పదవికి రాజీనామా చేశారు.

1985లోరాజీవ్‌గాంధీ కేబినెట్లో పివి నరసింహారావు మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రిగా పనిచేశారు.

జాతీయ విద్యావిధానం 1986లోఆపరేషన్‌ బ్లాక్‌బోర్డు పథకాల రూపశిల్పి ఆయనే33శాతం పాఠశాలలకు ఒకేటీచర్‌ ఉన్నాడని అందువల్ల సింగిల్‌ టీచర్‌పాఠశాలలన్నీ డబుల్‌టీచర్‌ పాఠశాలలుగా మార్చా రు.

ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్నిస్థాపించి నాణ్య మైన విద్యవిధానానికి శ్రీకారం చుట్టారు.1991 జూన్‌21న జరిగిన ఎన్నికల్లో భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

పార్లమెంటు సభ్యుడు కాకుండా పివిప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం భారత దేశ చరిత్రలోనే నూతన ఒరవడిని సృష్టించిందిపి వి నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు.

రాజకీయ చాతుర్యంఆర్థిక పరిజ్ఞానంతో భారతదేశాన్ని ఆర్థికరంగంలో అత్యున్నత స్థాయికి తీసుకొచ్చారు. 2004 డిసెంబరు 23న ఆయన తుదిశ్వాస విడిచారు.

  • రావుల రాజేశం

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/