షర్మిలకు పువ్వాడ అజయ్ సవాల్

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. నిన్న పాదయాత్ర లో భాగంగా షర్మిల ఖమ్మం భహిరంగ సభలో పువ్వాడ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో పువ్వాడ నియంత పాలన జరుగుతుందని, ఉత్తి పుణ్యానికి మంత్రి కూడా అయ్యాడంటూ సెటైర్లు వేశారు. మంత్రి అయ్యాక… ఆ పదవికి విలువ లేదు, హోదా తెలియదు, హుందా కూడా తెలియదంటూ ఆమె మండిపడ్డారు. పువ్వాడ కు ఎన్ని ఆస్తులు సంపాదించినా…ఎన్ని కబ్జాలు చేసినా…దనదాహం మాత్రం తీరదంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు ..ప్రైవేట్ ఆస్తులు అన్ని కబ్జా చేస్తాడని, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అనేది పువ్వాడ కు సరిపోతుందంటూ ఆమె ధ్వజమెత్తారు. ఒకప్పుడు ఇల్లు లేని పువ్వాడకు హైదరాబాద్ శామీర్ పేట లో 80 ఎకరాల భూమి ఎలా వచ్చిందని, ఖమ్మంలో ఏ కాంట్రాక్ట్ చేసినా ఇతనే చేయాలని, ఆయన భార్య కంపెనీ..లేదా బినామీ కంపెనీ లే చేయాలన్నారు. ఈయన ట్రాన్స్ పోర్ట్ మంత్రి.. ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని ఆమె ఎద్దేవా చేశారు.

కాగా షర్మిల కామెంట్స్ ఫై పువ్వాడ స్పందించారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి.నేనేంటో చూపిస్తా అని సవాల్ విసిరారు. పాలేరు లో పోటీ చేసిన మా దమ్ము ఏంటో చూపిస్తానని అన్నారు. గాలికి వచ్చి పోయే పార్టీ మీది అని ఎద్దేవా చేశారు. తన అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని సూచించారు. మీ నాన్న, అన్న డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు, మంత్రిపదవులు ఇచ్చారని అన్నారు. కెసిఆర్ మాకు ఉచితంగానే మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. ఆంధ్ర పాలకులు ఎన్నాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణ భూమి మీద మీకు ఏ హక్కు ఉంది? అని మండిపడ్డారు.