రేవంత్.. ఐటెం అంటూ పువ్వాడ కౌంటర్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఖమ్మం పర్యటన లో పువ్వాడ అజయ్ ఫై నిప్పులు చేరగడం తో..పువ్వాడ కూడా అంతే స్థాయిలో రేవంత్ ఫై కౌంటర్ ఎటాక్ చేసాడు. రేవంత్ రెడ్డి ఒక ఐటెం అని, కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి పోటీచేసిన సందర్భంలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు వదిలి పెడతా అని చెప్పాడు.. ముందు ఆ ఛాలెంజ్ కు కట్టుబడి ఉండు అంటూ మంత్రి పువ్వాడ విమర్శించారు. మమతా ఆస్పత్రిపై విచారణ చేయాలని గవర్నర్ కు రేవంత్ ఫిర్యాదు చేశాడు… మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చన్నారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చావు అంటూ మండిపడ్డారు. రేణుక చౌదరికి ఒక్కరు రావాలంటే భయం అందుకే రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చారని మంత్రి పువ్వాడ సెటైర్లు వేశారు. రేణుక చౌదరి బతుకే డ్రగ్స్‌, పబ్బు, క్లబ్బు.. ఆమె గురించి ఖమ్మం ప్రజలకు తెలుసని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకు ముందు రేవంత్..పువ్వాడ అజయ్ అనే బేకార్ గాడు మంత్రిగా ఉన్నాడని… కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టించిన సైకో మంత్రి పువ్వాడ అజయ్ అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. పువ్వాడకు భయపడాల్సి పని లేదని.. కాంగ్రెస్ పార్టీతో కార్యకర్తలతో పెట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. తన తండ్రి కమ్యూనిస్ట్ భావజాలంతోని కులాలకు అతీతంగా మనుషులు మనుషులుగా ఉండాలని చెప్పాడని చెప్పుకుంటున్న పువ్వాడ అజయ్.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకుని బతకాలని చూస్తున్న నీచుడు పువ్వాడ అజయ్ అని విమర్శించారు.