మంత్రి పువ్వాడకు మళ్లీ కరోనా.. అధికారుల హైరానా!

కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు కరోనాతో విలవిలలాడుతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారిన అందరూ పడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడుతుండటంత అధికారులకు ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కరోనా తొలి వేవ్‌లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

కరోనా సోకడంతో చికిత్స చేసుకున్న పువ్వాడ దాని నుండి కోలుకున్నాడు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌లో పువ్వాడకు మళ్లీ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. తనకు కరోనా సోకిందని, ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని పువ్వాడ కోరారు.

ఇలా తెలంగాణ మంత్రి పువ్వాడకు మళ్లీ కరోనా రావడంతో అధికారులు హైరానా చెందుతున్నారు. ఒకసారి కరోనా వచ్చిన తరువాత మళ్లీ రావడం ఏమిటని వారు అంటున్నారు. ఏదేమైనా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అందరికీ ఇది మరోసారి సోకే అవకాశం ఉందని వారు అంటున్నారు.