స్వీయ నిర్బంధంలోకి ర‌ష్యా అధ్య‌క్షుడు

మాస్కో: ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐసోలేష‌న్‌లోకి వెళ్ల‌నున్నారు. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒక‌రికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. దీంతో ఆయ‌న స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వీడియో లింకుల ద్వారా ఆయ‌న స‌మావేశాల‌కు హాజ‌ర‌కానున్న‌ట్లు క్రెమ్లిన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ప్ర‌ధాన మీటింగ్‌ల‌న్నీ ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించ‌నున్నారు. జ‌ర్న‌లిస్టుల కోసం ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. పుతిన్ ఐసోలేష‌న్‌లోకి వెళ్ల‌నున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. త‌జ‌క్ నేత ఎమ్మోమ‌లి రెహ‌మాన్‌తో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లో పుతిన్ మాట్లాడారు. అయితే తాను ఉంటున్న ప్ర‌దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని, కొన్ని రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్న‌ట్లు పుతిన్ ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/