దేశ జనాభాను పెంచేందుకు మహిళలకు ఆఫర్ ప్రకటించిన అధ్యక్షుడు పుతిన్

ఒక మిలియన్ రూబుల్స్ నగదు కానుక

Putin
Putin

మాస్కోః రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ జనాభాను పెంచేందుకు కంకణం కట్టుకున్నారు. పది మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగిన మహిళలకు నగదు ప్రయోజనాలను ప్రకటించారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం ఆ దేశ జనాభా ఉత్పత్తిపై పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ప్రోత్సహించాలని పుతిన్ నిర్ణయించారు.

పది మంది పిల్లలను కనే మహిళకు ఒక మిలియన్ రూబుల్స్ ( 13,500 పౌండ్లు)ను ఇవ్వడం ఇందులో ఒకటి. పదో సంతానం మొదటి పుట్టిన రోజున ఈ మొత్తాన్ని ఇస్తారు. కాకపోతే అప్పటికి మిగిలిన తొమ్మిది మంది పిల్లలు కూడా జీవించి ఉండాలి. పుతిన్ విధానాన్ని నిపుణులు విమర్శిస్తున్నారు. ఎక్కువ మందిని కనే వారినే దేశభక్తులుగా పేర్కొంటున్నట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు. విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశమైన రష్యా జనాభా కేవలం 14 కోట్లుగానే ఉండడం గమనార్హం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/