పదవి నుంచి తప్పుకోవాలని కుటుంబం ఒత్తిడి!

పుతిన్‌కు అనారోగ్యమంటూ ఊహాగానాలు

vladimar putin
vladimar putin

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. పుతిన్‌ పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని కుటుంబం నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగిందని మాస్కోకు చెందిన రాజకీయ నిపుణులు వలెరీ సోలోవీని ఉటంకిస్తూ బ్రిటన్‌కు చెందిన ‘డెయిలీమెయిల్‌’ కథనం ప్రచురించింది. పుతిన్‌కు పార్కిన్సన్‌ ఉండొచ్చని, ఇటీవల ఆయనలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించాయని సోలోవీ పేర్కొన్నారు. (పుతిన్‌ కాళ్లు వణకటం, పెన్ను పట్టి సరిగా రాయలేకపోవడం ఇటీవలి వీడియోల్లో కనిపించాయి). ఈ వార్తలను రష్యా ఖండించింది. పుతిన్‌ ఆరోగ్యంగానే ఉన్నారని రష్యా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/