పుతిన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది : ఉక్రెయిన్ నిఘా అధికారి

రష్యాలో తాను రహస్యంగా పర్యటించినప్పుడు ఈ విషయం తెలిసిందని వెల్లడి

russian-president-vladimir-putin

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ అనారోగ్యంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చాలాకాలంగా పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారనే ప్రచారం జ‌రుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రష్యా ..చైనా ఉత్తరకొరియా లాంటి కమ్యూనిస్టు దేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్తకూడా అంత తొందరగా రాదు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తోందని చెప్పారు. రెండేళ్లకు మించి ఆయన జీవించే అవకాశాలు ఏమాత్రం లేవని అన్నారు. ఇటీవలే తాను రష్యాలో రహస్యంగా పర్యటించానని… తనకు ఈ మేరకు కచ్చితమైన సమాచారం అందిందని చెప్పారు.

మరోవైపు పుతిన్ కంటిచూపు కూడా తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడని, ఆయనకు గతంలో క్యాన్సర్ సర్జరీ కూడా జరిగిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాన్సర్ మరింత ముదిరిందని అంటున్నారు. ఇంకోవైపు బ

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/