మంచుపై హాకీ ఆడుతూ కింద పడ్డ ఫుతిన్‌

phutin
phutin

సోచి: హాకీ గేమ్‌ ఆడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ ఫుతిన్‌ పొరపాటున కిందపడిపోయాడు. హాకీ గేమ్‌ అంటే నేలపై అనుకుంటే పొరపాటే, మంచుపై ఆడుతూ కిందపడిపోయారు. 66 ఏళ్ల ఆయన సోచిలోని బ్లాక్‌ సీ రిసార్ట్‌లో బోల్షోయి అరెనా వద్ద స్కేటింగ్‌ చేస్తూ అంచుకంటా వెళ్లిపోవడంతో ఈ సంఘటన జరిగింది. అభిమానులకు అభివాదం చేస్తూ స్కేటింగ్‌ చేస్తున్న ఆయన ఉన్నట్లుండి అక్కడి రెడ్‌కార్పెట్‌పై తూలిపడిపోయారు. ఆయనను పట్టుకునేందుకు ఇద్దరు టీమ్‌ సభ్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఐతే ఆయన తనంతటతానుగా లేచి స్కేటింగ్‌ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రతి ఏటా హాకీ ఆడే ఫుతిన్‌ ఈ ఏడు 8 గోల్స్‌ చేశారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/