చైనాకు పాకిస్థాన్‌ సూచన!

china with pakistan, masood
china with pakistan, masood

ఇస్లామాబాద్‌: జైషే మహ్మద్‌ ఉగ్రనేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి అమెరికా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొన్ని షరతులపై మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి అంగీకరించాలని చైనాకు పాక్‌ సూచించినట్లు సమాచారం. భారత్‌పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గేలా భారత్‌ చర్యలు తీసుకోవడం, పాక్‌తో వెంటనే ద్వైపాక్షిక చర్చల్ని పునరిద్ధరించడం లాంటి షరతుల్ని చైనాకు పాక్‌ సూచించినట్లు తెలుస్తోంది. మసూద్‌ అంశంపై భద్రతా మండలిలో చైనా తాత్కాలిక నిలుపుదలకు గల కారణాలకు నివేదించాల్సిన గడువు ఈ వారంతో ముగియనుంది. ఈ క్రమంలో పాక్‌కు చైనా సూచించిన షరతులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్‌ సూచించిన షరతులను చైనా ఇప్పటికే అగ్రరాజ్యానికి తెలియజేసిందని అమెరికాలోని భారత దౌత్యవేత్తలతో పాటు, అక్కడి అధికారులు తెలిపారు. అయితే దీనిపై ట్రంప్‌ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి, భారత్‌పాక్‌ మధ్య చర్చలకు ఎటువంటి సంబంధంలేదని వారు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/