గృహహింసకు పుల్‌స్టాప్ పెట్టండి
భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో, ఇంటికే పరిమితమయిన ప్రజలు గృహహింసకు పాల్పడుతూన్నారు. గత కొద్ది రోజులుగా గృహహింస కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న గృహహింసను అంతమొందించాలని టిమిండియా స్టార్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కోరాడు. ప్రస్తుతం తాను ఇంట్లో కుటుంబంతో కలిసి సంతోకరమైన సమయాన్ని గడుపుతూన్నానని అన్నాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఈ రోజుల్లో కూడా కొందరు గృహహింసకు పాల్పడుతున్నారని, వారికి పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు. గృహహింసకు దూరంగా ఉంటూ భాగస్వామితో ప్రేమగా గడపాలని సూచిస్తు తన భార్య కుమారితో కలిసి ఉన్న ఓ చిన్న వీడియోను పోస్ట్ చేశాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/