‘పుష్పక విమానం’ ట్రైలర్ రిలీజ్ కు సన్నాహాలు

30న ఈవెంట్ : చీఫ్ గెస్ట్ గా ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్

Pushpaka Vimanam trailer release date fix
Pushpaka Vimanam trailer release date fix

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 30న “పుష్పక విమానం” సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతున్నారు అల్లు అర్జున్. బన్నీ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవడం “పుష్పక విమానం” యూనిట్ మొత్తానికి సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా కలిసి థాంక్యూ బన్నీ అన్నా అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు.

“పుష్పక విమానం” సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.

“పుష్పక విమానం” చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.

టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/