ఆగని పుష్ప రికార్డ్స్ …

పుష్ప చిత్రం విడుదలై చాల నెలలు కావొస్తున్న ఇంకా రికార్డ్స్ సాధిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న పుష్ప..తాజాగా మరో రికార్డు సాధించింది. తాజాగా ఈ సినిమాలోని ‘సామి సామి’ పాట వ్యూస్ పరంగా ఏకంగా 100 మిలియన్ క్లబ్‌లో చేరిపోయింది. ఇదే విషయాన్ని అధికారికంగా ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ఈరోజు ప్రకటించింది. చంద్రబోస్ రాసిన ఈ పాటకి మాస్ ఆడియన్స్ నుంచి భారీ స్పందన లభించింది. అలానే మౌనిక యాదవ్ గొంతు ఈ పాటకి అదనపు ఆకర్షణ నిలవగా.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్‌ థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయించాయి. ఇప్పటికి ఈ సాంగ్ మారుమోగిపోతూనే ఉంటుంది.

అల్లు అర్జున్ – రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ డైరెక్ట్ చేయగా , దేవి శ్రీ మ్యూజిక్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 ఫై ఫోకస్ చేసాడు. వాస్తవానికి పుష్ప-2 సినిమా కూడా ఈ ఏడాది డిసెంబరులో రావాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాలతో ఇంకా ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉంది. దాంతో వచ్చే ఏడాది పుష్ప -2 వచ్చే అవకాశం ఉంది.