3000 థియేటర్స్ లలో పుష్ప రిలీజ్..ఏంటి సామీ ఇది

కరోనా కారణంగా వాయిదాపడ్డ సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకవస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన అఖండ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నెలకొల్పి..చిత్రసీమ సరికొత్త కళను తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను అఖండ బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక రేపు పుష్ప మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుకుమార్ – అల్లు అర్జున్ – దేవి కలయికలో హ్యాట్రిక్ మూవీ గా రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సాంగ్స్ తోనే సగం విజయం సాధించడం తో రేపు ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రేపు 3000 థియేటర్స్ లలో పుష్ప రిలీజ్ కాబోతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1150 వరకు థియేటర్స్‌లో ‘పుష్ప’ మూవీ రిలీజ్ కాబోతుండగా..ఒక్క నైజాంలో 375 ప్లస్ థియేటర్స్ లలో సందడి చేయబోతున్నాడు పుష్ప రాజ్. ఇక సీడెడ్ 260 ప్లస్ థియేటర్స్, ఆంధ్ర 515 ప్లస్ థియేటర్స్ లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో 140, తమిళనాడులో 280, కేరళ 200, హిందీ, రెస్టాఫ్ ఇండియా కలిపి 600, ఓవర్సీస్‌లో మరో 600 థియేటర్స్ పుష్ప కోసం కేటాయించబడ్డాయని, మొత్తంగా చూస్తే 3000 పైగా థియేటర్స్‌లో పుష్ప రిలీజ్ కానుందని అంటున్నారు. ఇక తెలంగాణ లో పుష్ప కు ఐదు షో లకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. దీంతో పుష్ప కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ భారీ రేంజ్‌లో రూపొందించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించగా సమంత స్పెషల్ సాంగ్ చేసింది.