పుష్ప పబ్లిక్ టాక్…

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో సినిమా ‘పుష్ప’. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో రిలీజైంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరు మీద చేసారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతంది. ప్రస్తుతం ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ప్రీమియర్ షోస్ పూర్తి కావడం తో సినిమా ఎలా ఉందనేది అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి వారు ఎలా స్పందిస్తున్నారంటే..

ఈ సినిమా చూసిన అభిమానులు అల్లు అర్జున్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని, ఆయన రోల్ నెవర్ బిఫోర్ అని కితాబిస్తున్నారు. సందర్భానుసారంగా వచ్చే పోరాట సన్నివేశాలు, ఎలివేషన్స్ అదిరిపోయాయని, సినిమా చాలా బాగా వచ్చింది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కవుట్ కాలేదనే అంటున్నారు. పుష్ప మొదటి భాగానికి ఎండ్ అనేది ఇవ్వలేదని, రెండో భాగం వస్తేనే సినిమా కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. రెండో భాగం కోసం వేచి చూడక తప్పదని అంటున్నారు. పుష్ప వన్ మ్యాన్ షో అని, ఇది అల్లు అర్జున్ బెస్ట్ ఫిలిం అవుతుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ నటనతో పాటు ఇంటర్వెల్ సీన్స్, అలాగే క్లైమాక్స్ సీన్స్ ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్ కాగా, అల్లు అర్జున్- రష్మిక నడుమ చిత్రీకరించిన కొన్ని సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెగెటివ్ పాయింట్స్ అని అంటున్నారు.

ఇక అనసూయ, సునీల్ రోల్స్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సిందని, రష్మిక మందన తన పాత్రకు న్యాయం చేసిందని, ఇక అల్లు అర్జున్ అన్ని షేడ్స్‌లో అదరగొట్టేశారని చెబుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అన్నీ బాగా కుదిరాయని అంటున్నారు. ఇకపోతే అంతా ఊహించినట్లుగానే సమంత స్పెషల్ సాంగ్ కేకలు పెట్టించింది అంటున్నారు.