మెగా ఫ్యామిలీ కి కలిసొచ్చే ప్లేస్ లో పుష్ప ప్రీ రిలీజ్ వేడుక ..

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ప్రీ రిలీజ్ వేడుక కు వేదికను ఖరారు చేసారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాదు .. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ అంటే మెగా ఫ్యామిలీ కి ఓ సెంటిమెంట్ ఇక్కడ ప్రీ రిలీజ్ వేడుక జరిపితే..ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అని నమ్ముతారు. ఇప్పటివరకు ఆలా జరిగిన చాల సినిమాలు విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు పుష్ప ప్రీ రిలీజ్ వేడుక కూడా యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరుపుతుండడం తో సినిమా హిట్టే అంటూ మరింతగా కామెంట్స్ పెడుతున్నారు.

పాన్ ఇండియా మూవీ పుష్ప ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేసారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.