హిందీ లో రూ.50 కోట్లు క్రాస్ చేసిన పుష్పరాజ్

బాలీవుడ్ లో పుష్పరాజ్ సందడి మాములుగా లేదు. మూడు వారాల్లోనే రూ. 50 కోట్లు క్రాస్ చేసి 75 కోట్ల వైపు పరుగులుపెడుతూ అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘ ‘పుష్ప : ది రైజ్’ ‘ చిత్రం.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో బన్నీ తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుండడం తో అక్కడి నిర్మాతలు , హీరోలు షాక్ అవుతున్నారు.

హిందీ లో కేవలం మూడు వారాల్లో రూ.50 కోట్లు వసూళ్లు సాధించాయి. శనివారం ఒక్కరోజే రూ.6.1 కోట్ల కలెక్షన్ రావడం విశేషం. ఇదంతా చూస్తుంటే రూ.75 కోట్ల మార్క్​ను అందుకోవడానికి పెద్దగా సమయం పట్టేలా లేదని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇదే తరుణంలో కొంతమంది హిందీలో ఇంకాస్త ప్రమోషన్ చేస్తే బాగుండని అంటున్నారు. పుష్ప ప్రమోషన్ ఎక్కువ కూడా తెలుగులోనే చేసారు. హిందీ లో జస్ట్ పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేసి వదిలేసారు. కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తే సినిమా కలెక్షన్లు ఈపాటికే వంద కోట్లు దాటేవని అంటున్నారు.