తెలుగు రాష్ట్రాల్లో పుష్ప హంగామా

గత కొద్దీ రోజులుగా యావత్ సినీ ప్రేక్షకులు , బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప మూవీ ఈరోజు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుండే పుష్ప హంగామా మొదలైంది. తెలంగాణ లో ప్రీమియర్ షోస్ కు అనుమతి ఇవ్వడం , అలాగే ఐదో షో కు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్స్ వద్ద భారీ భారీ కట్ ఔట్స్ , ప్లెక్సీ లు కట్టి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే బాణా సంచా కాల్చడం , బన్నీ కట్ ఔట్స్ కు పాలాభిషేకం చేయడం చేస్తూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సందడి చేస్తున్నారు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో సినిమా ‘పుష్ప’. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో రిలీజైంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతంది. ఇక హిందీ వెర్షన్ కోసం అక్కడ ఈ సినిమాను ప్రమోషన్‌ను చేసారు. దర్శకుడు సుకుమార్ లేకుండా.. అల్లు అర్జున్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి. సుకుమార్ కూడా ఈ సినిమా కోసం లాస్ట్ వరకు కష్టపడ్డారు. ఇక ఈ సినిమాపై ఎలా ఉందనే దానిపై అభిమానులు, సామాన్య ప్రేక్షకులు ఎలా స్పందిచారనేది కాసేపట్లో తెలుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ గా ఈరోజు డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.