పూరీ జగన్నాథ్ ఆలయం మూడు రోజుల పాటు మూసివేత

డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆలయం మూసివేత

ఒడిశా: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ ఆలయం మూడు రోజుల పాటు మూతపడనుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మూడు రోజులు భక్తులను అనుమతించబోమని ఆలయ అధికారులు వెల్లడించారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని.. దీనివల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని… అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ విషయాన్ని భక్తులందరూ గుర్తించాలని, ఆ మూడు రోజుల పాటు ఎవరూ గుడికి రావద్దని కోరారు. అయితే స్వామివారికి యథావిధిగా అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/