గాడ్ ఫాదర్ లో పూరి రోల్ అదేనా..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ లో ఓ కీలక రోల్ చేస్తున్నట్లు స్వయంగా చిరంజీవే ప్రకటించారు. నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే పూరీ జగన్నాథ్‌ను గాడ్ ఫాదర్ చిత్రంలో స్పెషల్ రోల్‌లో పరిచయం చేస్తున్నాను అని చిరంజీవి ట్వీట్ చేసి ఆసక్తి పెంచారు.

ఈ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి మెగా అభిమానులతో పాటు పూరి ఫ్యాన్స్ సైతం పూరి సినిమాలో ఏ రోల్ చేస్తున్నాడు..ఎలా కనిపిస్తాడు..సినిమాలో ఎక్కడ కనిపిస్తాడని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో పూరి రోల్ ఫై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సినిమా ఆరంభంలో పాత్రలను పరిచయం చేసే జర్నలిస్టు పాత్రలో ఈ స్టార్ డైరెక్టర్ కనిపించబోతున్నట్టు సమాచారం. గాడ్ ఫాదర్‌ సినిమాను డ్రైవ్ చేసే పాత్రను పూరీ పోషిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకు కీలకంగా మారబోతున్నట్టు అంటున్నారు. మరి నిజంగా ఇదే రోల్ చేస్తున్నాడా అనేది చూడాలి. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, హరీష్ ఉత్తమన్, జయప్రకాశ్, వంశీ కృష్ణ తదితరులు నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం ఓ కీలక రోల్ లో కనిపించబోతున్నాడు.