స్టార్‌హీరో కోసం స్టోరీ

లాక్‌డౌన్‌ సమయంలో పూరి ఆసక్తికరమైన స్క్రిప్టు

స్టార్‌హీరో కోసం స్టోరీ
Director Puri Jaganath

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ‘ఇస్మార్ట్‌శంకర్‌తో భారీ విజయాన్ని నమోదు చేశారు.. ఆసక్సెస్‌ ఇచ్చిన కిక్‌తో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్‌ సినిమా చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ సమయం కావటంతో ఈ ఖాళీ సమయంలో ఓ స్టార్‌హీరో కోసం ఓ ఇంట్రెస్టింగ్‌ స్క్రిప్టు రాస్తున్నట్టు స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ విరామం తనకు తాజాగా ఆలోచించటానికి అలాగే భిన్నమైన కథలను రాయటానికి అద్భుతమైన అవకాశం అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ కథ నటసింహ బాలకృష్ణకోసమే రాస్తున్నట్టు అంటున్నారు.. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పైసావసూల్‌ చిత్రంలో బాలయ్యను ఆయన ఎంతో వైవిధ్యంగా చూపించిన సంగతి విదితమే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/