తడిసిన ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు

singireddy niranjan reddy
singireddy niranjan reddy, agriculture minister

నాగర్‌కర్నూల్‌: ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఐతే తడిసిస ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్‌ వ్యవసాయ మార్కెట్‌ను మంత్రి నేడు సందర్శించారు. అకాల వర్షానికి తడిసిని ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. అధికారులు నిరంతరం రైతుల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. గోనె సంచుల సరఫరాలో కొంతజాప్యం జరిగిందని అన్నారు. ధాన్యం తూకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కమీషన్లు తీసుకున్నా, మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/