రికార్డుస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు

 మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడి

TS Minister Gangula Kamalakar
TS Minister Gangula Kamalakar

Karim Nagar: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్‌, రైతు బంధు, కాళేశ్వరం జలాలతో భూమికి బరువయ్యే పంట పండిందన్నారు.

ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వర్షాకాలం లో పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ అభివృద్ధి కోసం కేటాయించిన మొదటి వంద కోట్ల నిధుల నుండి కోటి రూపాయలను వెచ్చించామన్నారు.

300 సీసీ కెమెరాలు, 4 మెగా ఫిక్సెల్‌ సిసి, నెట్‌ వర్క్‌ వీడియో రికార్డు కెమెరాలు, ఎల్‌ఈడిలు కొనుగోలు చేశామని చెప్పారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/news/national/