అసెంబ్లీ లో వైసీపీ నేతల తీరుపై పురంధేశ్వరి ఆగ్రహం

అసెంబ్లీ లో వైసీపీ నేతల తీరుపై పురంధేశ్వరి ఆగ్రహం

శుక్రవారం ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు , ఆయన సతీమణి భువనేశ్వరి ఫై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ ఫై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది రాజకీయనేతలు ఈ ఘటన గురించి స్పందించగా..తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో.. వ్యక్తిగత విమర్శలు సరికాదని అన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నేతల భాషా ఏ మేరకు దిగజారిందో ప్రజలంరూ గమనిస్తు్న్నారని.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ఆమె హెచ్చరించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని… విభజన చట్డంలోని 90 శాతం అంశాలు పూర్తయ్యాయని ఆమె వెల్లడించారు.

ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ఏపీకి అనేక విధాలుగా సహకరిస్తుందని… ఏపీకి నిధులిచ్చే విషయంలో కేంద్రం ఎక్కడా మడప తిప్పలేదన్నారు. ఏపీ ఆర్ధిక స్ధితి సరిగా లేకపోతే కేంద్రమే నిధులిచ్చిందని.. కేంద్రం నిధుల వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. అమరావతికి కట్టుబడి ఉన్నామని గతంలోనే ప్రకటించాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని వెల్లడించారు.