పాటియాలలో ఇద్దరు హాకీ క్రీడాకారుల హత్య

Two Hockey Players Shot Dead in patiala
Two Hockey Players Shot Dead in patiala

పాటియాలా: పాటియాలాలో ఇద్దరు హాకీ క్రీడాకారులు దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని ప్రతాప్‌ నగర్‌ ప్రాంతంలో ఒక ధాబా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వారిని హత్య చేశారు. మృతులను అమ్రిక్‌ సింగ్‌, సిమ్రంజిత్‌ సింగ్‌గా గుర్తించారు. అమ్రిక్‌ సింగ్‌ జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు కాగా, సిమ్రంజిత్‌ సింగ్‌ ఇటీవలే భారత హాకీ బృందానికి ఎన్నికయ్యాడు. ధాబా వద్ద వీరిద్దరికీ మరికొందరితో ఘర్షణ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు మృత దేహాలను ప్రభుత్వ రాజీంద్ర ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/