హాస్పటల్ లో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీలోని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆయనను అక్కడి వైద్యులు ప్రత్యేకంగా టెస్ట్ లు చేశారు. కాగా పంజాబ్ సీఎం ఆస్పత్రిలో చేరడంతో.. అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాడు చేశారు. ఇదిలా ఉంటే.. దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)ను మాన్ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక బుధువారం పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా చీచా భక్నా గ్రామంలో మూసేవాలా హత్యతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. ఓ ఇంట్లో ఇద్దరు అనుమానితులు ఉన్నట్లు గుర్తించారు. ఐతే పోలీసులను చూసి వారు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనుమానితులు మన్‌ప్రీత్ మన్నూ , జగ్‌రూప్ సింగ్ రూపా ఇద్దరు హతమయ్యారు.