మోది ప్రమాణానికి అమరీందర్ సింగ్ గైర్హాజరు

న్యూఢిల్లీ: నరేంద్ర మోది ఇవాళ ప్రధానిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు జరిగే ఈ వేడుకలో పాల్గొనేందుకు సుమారు 8 వేల మంది అతిథులు వస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయ ఆవరణలో ప్రమాణోత్సవం జరగనున్నది. ఐతే ఈ కార్యక్రమానికి పంజాబ్ సియం అమరీందర్ సింగ్ వెళ్లడం లేదు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సియం మీడియా అడ్వైజర్ స్పష్టం చేశారు. మోదీతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. మయన్మార్ అధ్యక్షుడు ఊ విన్ మింట్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, థాయిల్యాండ్ అంబాసిడర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/