పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా!

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేశారు. కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి శనివారంతో తెరపడింది. రాజ్‌భవన్‌కు చేరుకుని అమరీందర్‌ సింగ్‌ గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రమవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తున్నట్లు కనిపించే ఫొటోను ఆయన కుమారుడు రణీందర్ సింగ్ ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/