ఆప్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేత

Punjab and Haryana High Court quashes FIRs against Kumar Vishwas and Tejinder Bagga

న్యూఢిల్లీః పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వానికి పంజాబ్‌, హర్యానా కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ బిజెపి నేత తేజిందర్‌ బగ్గాతోపాటు ప్రముఖ కవి కుమార్‌ బిశ్వాస్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. బిజెపి నేత తేజిందర్‌ బగ్గాపై చేసినట్లుగా చెప్తున్న ట్వీట్లు పంజాబ్‌లో చేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఆయన చేసిన ట్వీట్లు ఆగ్రహం కలిగించేవిగా లేవని పేర్కొన్నది. రాజకీయాల్లో ఉన్నవారు ఒకరిపై మరొకరు వాక్చాతుర్యం చేసుకోవడం పరిపాటే అని, ఇది ఎలాంటి హిస్టీరియాను వ్యాపింపజేయదని హైకోర్టు చెప్పింది.

కాగా, ప్రముఖ కవి కుమార్‌ బిశ్వాస్‌పై రోవర్‌లో కేసు నమోదైంది. అరవింద్ కేజ్రీవాల్‌ను ఖలిస్థాన్ అనుకూలుడిగా ఆయన ఆరోపించారని, దాంతో ఆయనతో పాటు పార్టీ ప్రతిష్ట మసకబారిందని ఆప్‌ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి ఘజియాబాద్‌లోని ఆయన ఇంటికి వచ్చిన పంజాబ్ పోలీసులు నోటీసు ఇచ్చి విచారణకు రావాలని సూచించారు. దీనిపై కుమార్ బిశ్వాస్‌ హైకోర్టులో చాలెంజ్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లను విచారించిన పంజాబ్‌, హర్యానా కోర్టు.. బుధవారం తుది తీర్పును వెలువరించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/