బంగారు మాస్కు ధరించిన పుణే వ్యక్తి

రూ.2.90 లక్షల బంగారంతోమాస్కు

బంగారు మాస్కు ధరించిన పుణే వ్యక్తి
pune-man-wears-gold-mask

పూణే: అందరూ కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు మార్కెట్లో దొరిరూ మాస్కులు వాడుతున్న విషయం తెలిసిందే.  ఇక పుణెకు చెందిన ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా బంగారు మాస్క్‌ను పెట్టుకున్నాడు.  పింప్రి చించ్‌వాడ‌కు చెందిన శంక‌ర్ కుర్‌హేడ్ అనే వ్య‌క్తి సుమారు 2 ల‌క్ష‌ల 90 వేల ఖ‌రీదైన గోల్డెన్ మాస్క్‌ను త‌యారు చేయించుకున్నాడు. ఈ మాస్క్ కోసం సుమారు అయిదున్న‌ర తులాల బంగారం వాడిన‌ట్లు తెలుస్తోంది.   బంగారంతో త‌యారైన మాస్క్ మందంగా ఉన్న‌ద‌ని, వాటికి చిన్న చిన్న రంథ్రాలు ఉన్నాయ‌ని శంక‌ర్ తెలిపాడు. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది లేద‌న్నాడు. అయితే ఈ మాస్క్ ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తుందో చెప్ప‌లేమ‌న్నాడు. 

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/