ప్రాణం తీసిన పబ్జీగేమ్‌

యువకుడికి గుండెనొప్పితో పాటు ఒకేసారి బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మృతి

pubg game
pubg game

పూణే: ఆన్‌లైన్‌గేమ్‌ పబ్జీకు వ్యవసపరుడిగా మారి.. ఓ యువకుడు ఏకంగా ప్రాణాల్ని తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రంలోని పూణేకు చెందిన హర్షల్‌ (27) గత రెండేళ్లుగా పబ్జీకి వ్యసనపరుడిగా మారాడు. ఏపనీ లేకుండా 24 గంటలూ ఆదే ఆటలో మునిగితేలేవాడు. ఈ నేపథ్యంలోనే గత గురువారం తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు. అయితే హర్ట్‌ ఎటాక్‌తో పాటు ఒకేసారి బ్రైయిన్‌ స్ట్రోక్‌ కూడా వచ్చిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతని మెదడులోని కణజాలం చిట్లి తీవ్ర రక్తస్రావం అయిందని, దీంతో హర్షల్‌ మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. కుమారుడు మృతిపై అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విపరీతంగా పబ్జీ ఆడటంమూలంగానే తమ కుమారుడు మృతిచెందాడని విలపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/